Friday 12 October 2012

శేఖర్ . . . . . .
ఈ రోజుల్లో, .. .
ఏమున్నాదిలే నేస్తం !
నేడంటూ ప్రేమంటే,
నీకంటూ మనీ పర్సు లేదు ప్రేమించడానికి,
నీకంటూ పల్సరు బైకు లేదు నీతో మాట్లాడటానికి,
నీకంటూ ఏమున్నది మంచి మనసు తప్ప,
ఆ మనసు నిండా ప్రేమ తప్ప,
మదిని ఎవరు చూస్తారులే,
అది ఎవరికి కనిపిస్తుందిలే,

నీ పర్సు నిండుగా ఉండి,
నీ బండి ఇంథనం మెండుగా ఉంటే చాలు,
నీ వెనకాల నలుగురు ఆపై వారి ముందర మోపులు,
హ హ హ! ప్రేమంటే ఈ రోజుల్లో. . . . . .
కవిత!!!
నా కనులలో రూపం నీవై,
నా కనులకు కాంతివి నీవై,
నా మదిలో భావం నీవై,
నా కవితకు మూలం నీవై,
నా అర్థానికి లయ నీవై,
నా మస్తిష్కపు భ్రాంతివి నీవై,
నా రేపటి వెలుగువి నీవై,
నా కాలపు శూన్యం నీవై,
నా కాలపు గమ్యం నీవై,

నా గడిచిన కథవు నీవై,
నా భవిష్యత్ తారవు నీవై,
కవిత! నా కవిత
పంచభూతాల సాక్షిగా,
ప్రపంచ తీరాలకు దూరంగా ఎక్కడ దాగున్న వదలను నిన్ను,
కవిత!
ఒదలను ఒంటరిగా నిన్ను ఈ అవనిలో. . . . . . శేఖర్

కన్నీటి చుక్క

-నా భారత్ ప్రపంచం ముందుకు పోతోంది,
-అవినీతి ప్రపంచపు జాగిలంలోనికి,
ధరిత్రి దుఃఖిస్తోంది,
-దరిద్రంతో నిండిపోయి
నేను దుఃఖిస్తున్నాను 
దరిద్రపు ధరిత్రిని చూచి , . . . . .ఇలా కవిత రాస్తుండగా ...ఎటునుంచి వచ్చిందో
దిక్కులేకో,దారితెలియకో,
వచ్చింది ఒక నీటి చుక్క,
నీవెవరిని నేనడగగా
తాను కనీటి చుక్కని అని చెప్పి,
పేదవాడి ముప్పుతిప్పలకు
కనురెప్పలో తెప్ప వేసుకుని దాటానని చెప్పింది . . . .,
ఆ నీటి చుక్క . .కాదు కాదు ఆ కన్నీటి చుక్క. ., . . . . . . .శేఖర్

Sunday 1 January 2012

written by:-me
ఏవేవో ఊహలు
-అవి భయంకర సత్యాలు
ఏవేవో గాథలు
-అవి సత్యాలు కాని కథలు
ఏవేవో మాటలు
-అవి గుండెల్లో గ్రుచ్చే తూటాలు
అవిగో నోట్లకట్టలు
-దురాశ మూటలు
అదిగో పెద్ద పెద్ద చదువులు
-పరీక్షల పిడిగుద్దులు
చేస్తావా పెద్ద వ్యాపారం
న్యాయం,నిజాయితి లేని
వ్యాపకం
ఇవన్ని నా పిచ్చి పిచ్చి రాతలు
కాని ఇవి నగ్నసత్యాలు..
written by me:ఓ కవిత ! నా కవిత
నీ కోసం నేను
ఏమేమి రాసానో ఎన్నెని రాసానో.:
రాసినవన్ని ఆర్తితో,శ్రీశ్రీ స్పూర్తితో
రాయల్సినవి కసితో,ఆశతో ,నా కవితావేశపు జరితో ,
రాస్తా రాస్తూ ఉంటా నీ కోసం ఓ నా కవిత!

కవి

written by me :-
కవి కవికి కవితకు అర్థం చెప్పినవాడు కవి,
మలి మలికి జీవితపు తొలి అడుగుకి అర్థం తెలిసినవాడు కవి,
లిపి లిపికి లిపికకు సైతం భాష్యం నేర్పేవాడు కవి,
అల నింగి పై గల గంగను సైతం వర్ణించగలవాడు కవి,
కలి బలిని విథి వలను చేదించిన వాడు కవి,
మరి నేను? ? ? ? ?
ఏవేవో ప్రశ్నలు ? ? ? ? ?
writen by me:ఓ వెర్రివాడ!ఏదో చేద్దామని ఏదేదో రాద్దామని
కలం పత్రం పై పెట్టి రాయగానే
వెక్కిరించే వాళ్ళు తప్ప వెన్నతట్టేవాళ్ళేలేరా
నీ కవితను నమ్మే వారు లేరా,
నీకు తెలుసు నీ కవితకు ఈ సమాజంలో చోటు లేదని,నీ మనస్సులో చోటిచ్చావని! శేఖర్
by me : ఓ కవితా
యవ్వన సౌందర్యవతివై,
నీవు ఈ ఇలాతలంలో తచ్చాడుతున్నప్పుడు,
నువ్వు చూసిన ఆ రోదనలు వేదనలు,
సాథక భాదలు నాతో చెప్పినపుడు,
నా మదితో అవన్నీ కనీ వినీ,
విన్నవి కన్నవి నా మస్తిష్కపు వలయంలోంచి,
నా మనోవల్మీకంలోంచి,చీల్చి అర్థాలై,శబ్థాలై ,శబ్థాలకు తోడైన ప్రాసతో ,లయతో,ఒక అద్భుత ద్యుతితో,గతితో,ఉషోదయ చందస్సుతో,అలంకారపు మేథస్సుతో,ఇవేమి నాకు లేకపోయిన నన్ను శాసించి నాచే పలికించి న వేళ,
ఆ మాటలు తూటాలై పుస్తకమును ముద్దాడిన వేళ ఓ కవితా నా కవితా-శేఖర్
BY ME:-ఓ తరుణి!
వినీలా కాశంలో నిను నేను చూసిన ఆ వేళ,
నా మదిలోని భావానివై మెదిలిన ఆ వేళ,
నా కలం పరుగులెట్టిన ఆ వేళ,
నిను చూసి ఇవన్ని ఆగిన వేళ,
జడి జడిగా నువ్వు వర్షింపచేసిన ఆ సువర్షం నను తడిపిన ఆ వేళ,
నీవు ఎవరివో ,ఏ యువతివో అన్న
ప్రశ్న నా మదిని తొలిచిన వేళ,
నీ ముగ్థమనోహర రూపము చూచి నా రక్తము ఉత్తుంగమై ఎగిసిన వేళ,
ఎవరివో,నీవు ఎవతివో
నీ కోసమే నే పుట్టినట్టు నాకు తోచిన వేళ,
కిల కిలమని నీ నవ్వులు,
గల గల మని నీ నడకలు కన్న నా కన్నుల వన్నెలు మిన్నంటిన ఆ వేళ,
కవ్వించే నీ నవ్వుల పువ్వులు వెన్నలలై నన్ను పలకిరించి పులకిరింపచేసిన వేళ,
. . . . . . . . . , . . . . . . . . . . . . . .ఆనాడు తెలియలేదు నీవు ఎవరివని కాని ఈ వేళ తెలిసింది నీవు నా కవితవని, తెలిసింది నా కవితావేశానికి జనియించిన జననివని!

ఓ రామా!

by me:-ఏ విధముగా నిను నే కొలిచేనో,
నా బాధలు నీకు పట్టవు
ఓ రామా!
ఏ రూపున నిన్ను నే తలచేను
నా మొహమె నీకు తెలియదు ఓ రామ!
ఏ కిటుకున కనిపెట్టెవు నా కుటిలో దాగున్న గాధలు,బాధలు
ఏ మాయతో అవి పోగొట్టెవు
నీ కిటుకులు,నీ చెట్టు చాటు బాణాలు పనీచేయవు ఈ లోకంలో
నిను మించిన మాయగాళ్ళు ఉన్నారీకాలంలో!
రావణుని చంపినంత సులువుకాదు ఈ ప్రపంచంలో బతకనేర్వడం!
ఓ రామ! రఘుకులసోమ!
నీ మర్మము తెలియక నే మూర్ఖడనై రాసేనా ఈ కవిత!@శేఖర్

నా ఊహలు

by me:-నీలాకాశానికి నేనెగిరిపోతే,
సూర్యోదయ ఉషస్సును నేనాపగలిగితే,
నాకే గనక రెక్కలు ఉంటే,
ఎన్నో కలలు ఇంకెన్నో ఊహలు,
నన్నూరిస్తూ,మైమరపిస్తూ విరిస్తూ
ఊహలోకపు జాడల్ని,లోకపు సౌందర్యాన్ని నా ముందు,
కనుమూసిన నా కన్నులలో ఇవన్ని కనిపిస్తుంటే
నిజాలు కాని ఇవన్ని నన్ను భాదిస్తుంటే
ఇంతలో కనిపించి కనిపించని రూపుతో నా కవిత,ఆ అదిగో అదిగదిగో తళ తళ మని మేరిసే వళ్ళు
మిల మిల మని మెరిసే కళ్ళు
కలలో గాంచిన ఈ నా కళ్ళు
కల్లలుగా మిగిలే ఈ నా ఊహలు...,...
వెడలే నా కవిత నా మది గుడిలోంచి,
జడి జడిగా నను మరచి వెళ్ళింది నా ఊహల్లోంచి మరల ఎప్పటికో నా కవిత దర్శనం..................@శేఖర్
BY ME:-నా ఈ కవితాలోకంలో నేనొక్కడ్ని నిల్చిపోయాను,
అందరికీ అందనివాడనై నాకు నేనై ఉండిపోయాను,
ఎన్నో విమర్శలు,వాఖ్యలు, నన్ను ఒకడ్ని చేసిపోయాయి,
నా కవితను ఏడిపించాయి.
వింత ఘోషలు,పిశాచ హహాకారాలు నా కవితాలోకంలో వినబడుతున్నాయి,
మచ్చుకైనలేవు సంతోషసరాగాలు ఈ నా కవితలలో,
లోలోతున దాగున్న విషాదాలు నా గుండెలలో,!
నీవి కావన్న నిజాలు నిన్ను ముక్కలు చేస్తే
నీ కవితా సామ్రాజ్యాన్ని కకళావికలం చేస్తూ ఉంటే
చూస్తూ ఊరుకుంటావా?
లేదా కోపాగ్నిశిఖలను వారి మీద చిమ్మిపోతావా,
తిరగబడలేవా !భయమా?ఎందుకు
ఉందిగా నీ కవిత నీకు అండగా,
కోటి విద్యుత్ తేజాల కాంతి,
సహ్రస్ర ఐరావతాల మనోశక్తి,
ఆదిదేవుళ్ళను కన్న ఆదిపరాశక్తి,
ఉందిగా నీ కవితలో,
,-@శేఖర్

ఓ కవి!

by me:-ఓ కవి!
నను ఒక్క కుదుపు కుదుపి నా మదిని కదిపిన నీ కవితలు.
నీ కవితలే నాకు తొలి పలుకులు,
నిను తలచి నేనెన్నని రాస్తున్నానో,
నీ కవితలు చదివి నా కవితలు ఎన్నెన్ని పుడుతున్నాయో,
నా కవితకు ప్రాణం నీవు పోసావు,
నా ఇరు చేతులు చాచి నిను పిలుస్తున్నా,
నన్ను ఆవహించు నాచే పలికించు . . . . . .
ఇదిగో నీ కోసం నా ఈ తర్పణం ఈ కవితార్పణం . . . . . . . నన్ను శాసించి ,నాచే వ్రాయిస్తున్న కవి శ్రీశ్రీకి అంకితం-శేఖర్