Friday 12 October 2012

కన్నీటి చుక్క

-నా భారత్ ప్రపంచం ముందుకు పోతోంది,
-అవినీతి ప్రపంచపు జాగిలంలోనికి,
ధరిత్రి దుఃఖిస్తోంది,
-దరిద్రంతో నిండిపోయి
నేను దుఃఖిస్తున్నాను 
దరిద్రపు ధరిత్రిని చూచి , . . . . .ఇలా కవిత రాస్తుండగా ...ఎటునుంచి వచ్చిందో
దిక్కులేకో,దారితెలియకో,
వచ్చింది ఒక నీటి చుక్క,
నీవెవరిని నేనడగగా
తాను కనీటి చుక్కని అని చెప్పి,
పేదవాడి ముప్పుతిప్పలకు
కనురెప్పలో తెప్ప వేసుకుని దాటానని చెప్పింది . . . .,
ఆ నీటి చుక్క . .కాదు కాదు ఆ కన్నీటి చుక్క. ., . . . . . . .శేఖర్

No comments: