Sunday 1 January 2012

BY ME:-నా ఈ కవితాలోకంలో నేనొక్కడ్ని నిల్చిపోయాను,
అందరికీ అందనివాడనై నాకు నేనై ఉండిపోయాను,
ఎన్నో విమర్శలు,వాఖ్యలు, నన్ను ఒకడ్ని చేసిపోయాయి,
నా కవితను ఏడిపించాయి.
వింత ఘోషలు,పిశాచ హహాకారాలు నా కవితాలోకంలో వినబడుతున్నాయి,
మచ్చుకైనలేవు సంతోషసరాగాలు ఈ నా కవితలలో,
లోలోతున దాగున్న విషాదాలు నా గుండెలలో,!
నీవి కావన్న నిజాలు నిన్ను ముక్కలు చేస్తే
నీ కవితా సామ్రాజ్యాన్ని కకళావికలం చేస్తూ ఉంటే
చూస్తూ ఊరుకుంటావా?
లేదా కోపాగ్నిశిఖలను వారి మీద చిమ్మిపోతావా,
తిరగబడలేవా !భయమా?ఎందుకు
ఉందిగా నీ కవిత నీకు అండగా,
కోటి విద్యుత్ తేజాల కాంతి,
సహ్రస్ర ఐరావతాల మనోశక్తి,
ఆదిదేవుళ్ళను కన్న ఆదిపరాశక్తి,
ఉందిగా నీ కవితలో,
,-@శేఖర్

No comments: