Friday 12 October 2012

శేఖర్ . . . . . .
ఈ రోజుల్లో, .. .
ఏమున్నాదిలే నేస్తం !
నేడంటూ ప్రేమంటే,
నీకంటూ మనీ పర్సు లేదు ప్రేమించడానికి,
నీకంటూ పల్సరు బైకు లేదు నీతో మాట్లాడటానికి,
నీకంటూ ఏమున్నది మంచి మనసు తప్ప,
ఆ మనసు నిండా ప్రేమ తప్ప,
మదిని ఎవరు చూస్తారులే,
అది ఎవరికి కనిపిస్తుందిలే,

నీ పర్సు నిండుగా ఉండి,
నీ బండి ఇంథనం మెండుగా ఉంటే చాలు,
నీ వెనకాల నలుగురు ఆపై వారి ముందర మోపులు,
హ హ హ! ప్రేమంటే ఈ రోజుల్లో. . . . . .
కవిత!!!
నా కనులలో రూపం నీవై,
నా కనులకు కాంతివి నీవై,
నా మదిలో భావం నీవై,
నా కవితకు మూలం నీవై,
నా అర్థానికి లయ నీవై,
నా మస్తిష్కపు భ్రాంతివి నీవై,
నా రేపటి వెలుగువి నీవై,
నా కాలపు శూన్యం నీవై,
నా కాలపు గమ్యం నీవై,

నా గడిచిన కథవు నీవై,
నా భవిష్యత్ తారవు నీవై,
కవిత! నా కవిత
పంచభూతాల సాక్షిగా,
ప్రపంచ తీరాలకు దూరంగా ఎక్కడ దాగున్న వదలను నిన్ను,
కవిత!
ఒదలను ఒంటరిగా నిన్ను ఈ అవనిలో. . . . . . శేఖర్

కన్నీటి చుక్క

-నా భారత్ ప్రపంచం ముందుకు పోతోంది,
-అవినీతి ప్రపంచపు జాగిలంలోనికి,
ధరిత్రి దుఃఖిస్తోంది,
-దరిద్రంతో నిండిపోయి
నేను దుఃఖిస్తున్నాను 
దరిద్రపు ధరిత్రిని చూచి , . . . . .ఇలా కవిత రాస్తుండగా ...ఎటునుంచి వచ్చిందో
దిక్కులేకో,దారితెలియకో,
వచ్చింది ఒక నీటి చుక్క,
నీవెవరిని నేనడగగా
తాను కనీటి చుక్కని అని చెప్పి,
పేదవాడి ముప్పుతిప్పలకు
కనురెప్పలో తెప్ప వేసుకుని దాటానని చెప్పింది . . . .,
ఆ నీటి చుక్క . .కాదు కాదు ఆ కన్నీటి చుక్క. ., . . . . . . .శేఖర్