Sunday 4 December 2011

ఓ కవితా !నా కవితా

 ఓ కవితా
యవ్వన సౌందర్యవతివై,
నీవు ఈ ఇలాతలంలో తచ్చాడుతున్నప్పుడు,
నువ్వు చూసిన ఆ రోదనలు వేదనలు,
సాథక భాదలు నాతో చెప్పినపుడు,
నా మదితో అవన్నీ కనీ వినీ,
విన్నవి కన్నవి నా మస్తిష్కపు వలయంలోంచి,
నా మనోవల్మీకంలోంచి,చీల్చి అర్థాలై,శబ్థాలై ,శబ్థాలకు తోడైన ప్రాసతో ,లయతో,ఒక అద్భుత ద్యుతితో,గతితో,ఉషోదయ చందస్సుతో,అలంకారపు మేథస్సుతో,ఇవేమి నాకు లేకపోయిన నన్ను శాసించి నాచే పలికించి న వేళ,
ఆ మాటలు తూటాలై పుస్తకమును ముద్దాడిన వేళ ఓ కవితా నా కవితా-శేఖర్

Monday 25 July 2011

నా కవిత

పేరు ; విజయ శేఖర్ ఉపాధ్యాయుల
కలం పేరు ; విరించి

                                         *నా  కవిత

నా  మనస్సులో  ఉత్తుంగ తరంగంలా ఉప్పొంగే నా కవిత
రేపటి తరానికి ఓ మరు చరిత
అలల సాగరం పై సాగే ఓ మను గీతిక
సలిల కెరటాలపై తలపోసి తలపోసి
కార్మికుడి కష్టాన్ని కర్శకుడి శ్రంయాన్ని
హృదయ భారాన్ని నాలోని భావాన్ని
తెలియజేసే నా కవిత
ఒక సుందర సుమధుర చిరగీతిక
ఇది టాగోర్ లిపిక కాదు
శ్రీశ్రీ విప్లవ గీతిక కాదు
ఇది న మనసులోని భావ చంద్రిక

క్షణ క్షణం

పేరు ;ఉపాధ్యాయుల  విజయ్ శేఖర్                                                                                      
టైటిల్; క్షణ క్షణం
క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం
నీకోసం ఈ ఆవేశం
ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా
ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి 
పడిపోయా !
తర తరాలు యుగ యుగాలు
వత్సరాలు గడిచిన
మరువరాని మరపురాని క్షణాలను
తలచి తలచి దుఖిస్తూ 
నిర్జీవమైన దేహంతో
అంతులేని అనంతమైన
శూన్యంలో రెప్పపాటు
దుఖంతో
మూలుగుతూ మ్రుక్కుతూ
నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ
నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ
భాధతో వ్యధతో నీకోసం......................................................క్షణ క్షణం