Sunday 1 January 2012

BY ME:-ఓ తరుణి!
వినీలా కాశంలో నిను నేను చూసిన ఆ వేళ,
నా మదిలోని భావానివై మెదిలిన ఆ వేళ,
నా కలం పరుగులెట్టిన ఆ వేళ,
నిను చూసి ఇవన్ని ఆగిన వేళ,
జడి జడిగా నువ్వు వర్షింపచేసిన ఆ సువర్షం నను తడిపిన ఆ వేళ,
నీవు ఎవరివో ,ఏ యువతివో అన్న
ప్రశ్న నా మదిని తొలిచిన వేళ,
నీ ముగ్థమనోహర రూపము చూచి నా రక్తము ఉత్తుంగమై ఎగిసిన వేళ,
ఎవరివో,నీవు ఎవతివో
నీ కోసమే నే పుట్టినట్టు నాకు తోచిన వేళ,
కిల కిలమని నీ నవ్వులు,
గల గల మని నీ నడకలు కన్న నా కన్నుల వన్నెలు మిన్నంటిన ఆ వేళ,
కవ్వించే నీ నవ్వుల పువ్వులు వెన్నలలై నన్ను పలకిరించి పులకిరింపచేసిన వేళ,
. . . . . . . . . , . . . . . . . . . . . . . .ఆనాడు తెలియలేదు నీవు ఎవరివని కాని ఈ వేళ తెలిసింది నీవు నా కవితవని, తెలిసింది నా కవితావేశానికి జనియించిన జననివని!

No comments: