Sunday 16 June 2013

శేఖర్ //పరివేదన //

జుట్టు తెల్లబడీంది,
పళ్ళు ఊడిపొయాయి,
నీకు నడక నేర్పిన నేను
ఈనాడు నడవలెక పొతున్నా,
నీకు దారి చూపిన ఈ కనులు
నేడు కనిపించట్లేదు,
భుజాలలొ సత్తువ లేదు,
వంట్లో రక్తం లెదు
ముగ్గుబుట్ట వంటీ తల ,
కంపుకొట్టె శరిరం ,
అయినా పర్లేదు కదా నాయినా !!
నువ్వు నన్ను అక్కున చేర్చుకుంటావ్ కదూ !
అనాధ ఆశ్రమాలంటూ అనాధగ వదిలేయవు కదా ??
బిడ్డా ! నీకు గుర్తుందో లేదో మరీ ,
నీకై నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో ..
నిన్ను భుజాన్ని యెత్తుకొని తిప్పిన రోజులా......
నువ్వు చిన్నప్పుడు గుండెల మీద తన్నితే హాయిగా భరించాను ..
కాని ఈనాదు అదే చేస్తే తట్టుకొలేను నాయనా ..
నువ్వు తింటే చాలు అనుకున్నాను ,
నువ్వు నా మీద పొస్తే ఆనందించిన క్షణాలు ..
నిన్ను కంటిపాపలా చూసుకున్నానే ,,
నేడు నాకు కన్నీరు మిగిల్చి పోవూ కదా!!
కడదాక తోడుంటావు కదా కన్నా..
చివరి కట్టెను నువ్వె పేరుస్తావు కదూ ...
అనాధ శవంలా వదిలేయకే

No comments: